Sruthi Sinha: పెళ్లి పేరిట మోసం చేసిన నకిలీ ఐపీఎస్ అధికారిణి... రూ. 1.10 కోట్లు వసూలు చేయగా అరెస్ట్!

  • నెల రోజుల క్రితం వ్యక్తి ఆత్మహత్య
  • కేసును విచారిస్తుంటే శ్రుతి సిన్హా బాగోతం బట్టబయలు
  • పెళ్లి చేయిస్తానని చెప్పి డబ్బు వసూలు

ఓ నకిలీ ఐపీఎస్ అధికారిణి బాగోతాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. పెళ్లాడతానని చెప్పి, తాను ఐపీఎస్ ఆఫీసర్ నని మోసగించి, రూ. 1.10 కోట్లను కాజేసిన శ్రుతి సిన్హా అనే యువతి ఇప్పుడు కటకటాల వెనుక ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళితే...

ఆంధ్రప్రదేశ్ లో విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు అవాక్కయ్యే నిజాలను వెలికితీశారు. విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన బంధువైన శ్రుతి సిన్హా నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి పెళ్లి పేరుతో వీరారెడ్డి అనే వ్యక్తిని దారుణంగా మోసం చేసినట్టు తేల్చారు.

వీరారెడ్డి సోదరుడికి తన సోదరితో వివాహం జరిపిస్తానని మాటిచ్చిన శ్రుతి, ఆపై అతన్నుంచి రూ. 1.10 కోట్లు వసూలు చేసిందని, ఆ డబ్బుతో విలువైన ఆస్తులను, మూడు కార్లను కొనుగోలు చేసిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు, ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి కార్లు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అన్నారు. కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. విజయ్ కుమార్ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై విచారణ సాగుతోందని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News