India: రోహిత్ శర్మ 57 పరుగులతో శాసించే స్థితిలో భారత్!
- అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ తో మూడవ టెస్ట్
- 112 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
- ప్రస్తుతం క్రీజులో రోహిత్, రహానే
అహ్మదాబాద్ లో జరుగుతున్న మూడవ టెస్ట్ లో కేవలం 112 పరుగులకే ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ చేసిన భారత్, ఆపై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అజేయ హాఫ్ సెంచరీతో మ్యాచ్ ని శాసించే దిశగా సాగుతోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ 57 పరుగులతో నాటౌట్ గా ఉండగా, అజింక్యా రహానే ఒక పరుగు చేసి క్రీజులో అతనికి తోడుగా నిలిచాడు. ఇంగ్లండ్ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 13 పరుగుల దూరంలో మాత్రమే ఇండియా ఉంది.
ఇంగ్లండ్ ఆలౌట్ అయిన తరువాత భారత ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రారంభించగా, ఓపెనర్ శుభమన్ గిల్ 11 పరుగులు మాత్రమే చేయగా, ఆపై వచ్చిన పుజారా డక్కౌట్ అయ్యారు., కెప్టెన్ విరాట్ కోహ్లీ 58 బంతులాడి 27 పరుగుల వ్యక్తిగత స్కౌరు వద్ద అవుట్ అయ్యి పెవిలియన్ కు చేరాడు.
ఇక కపిల్ దేవ్ తరువాత, భారత్ తరఫున 100 టెస్టులాడిన ఫాస్ట్ బౌలర్ గా ఇషాంత్ శర్మ నిలువగా, అతన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, హోమ్ మంత్రి అమిత్ షాలు సన్మానించారు. సహచర క్రికెటర్లు గార్డ్ ఆఫ్ ఆనర్ తో సత్కరించారు.