Misses India: మిస్సెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన ఖమ్మం యువతి!

Khammam Lady Wins Misses India Runnerup
  • అహ్మదాబాద్ లో జరిగిన పోటీలు
  • తెలంగాణ నుంచి ఫైనల్ కు అర్హత సాధించిన ఫర్హా
  • మిస్సెస్ ఫోటోజెనిక్ అవార్డు కూడా
అహ్మదాబాద్ లో జరిగిన మిస్సెస్ ఇండియా సీజన్-2 పోటీల్లో తెలంగాణలోని ఖమ్మం ప్రాంతానికి చెందిన వివాహిత మహ్మద్ ఫర్హా రన్నరప్ గా నిలిచారు. దేశవ్యాప్తంగా మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు 912 మంది దరఖాస్తు చేసుకోగా, 41 మందిని ఫైనల్ పోటీలకు ఎంపిక చేశారు. వీరిలో తెలంగాణ నుంచి ఫర్హా మాత్రమే చోటు సంపాదించుకోగా, ఫోటో జెనిక్ విభాగంలో ఫర్హా విజేతగా నిలిచారు. ఆపై టాప్-5లో చోటు సంపాదించుకున్న ఆమె రన్నరప్ గా నిలిచారు.

ఎంబీయే విద్యను అభ్యసించిన ఆమె, ప్రస్తుతం మానవ హక్కులు, సోషల్ జస్టిస్ మిషన్, మహిళా సాధికారత సంస్థలకు ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈ విజయం తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె, మహిళల హక్కుల పరిరక్షణకు పోరాడతానని తెలిపారు. భర్తతో పాటు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, వారి ప్రోత్సాహంతోనే తాను ఈ విజయం సాధించానని చెప్పారు.
Misses India
Farha
Khammam

More Telugu News