Puduchcherry: నా ప్రభుత్వాన్ని కూల్చింది బీజేపీయే... నిప్పులు చెరిగిన నారాయణ స్వామి!

V Narayanaswami Accuses BJP for Trust Vote Defete
  • ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాం
  • అడుగడుగునా అడ్డు తగిలిన కిరణ్ బేడీ
  • ప్రజల్లోకి వెళ్లి తీర్పును కోరతానన్న నారాయణ స్వామి
నాలుగేళ్లకు పైగా ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించిన తన ప్రభుత్వాన్ని బీజేపీ, ఆ పార్టీ నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కుప్పకూల్చారని పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి ఆరోపించారు. ఈ ఉదయం బల నిరూపణలో విఫలమైన తరువాత, తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు.

కిరణ్ బేడీ ఎల్జీగా నియమితురాలైన నాటి నుంచి విపక్ష ఎమ్మెల్యేలకే మద్దతుగా నిలిచి, సంక్షేమాన్ని వదిలేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకున్నారని, తన ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ప్రజలకు చేరనివ్వ లేదని మండిపడ్డారు. మరోమారు ప్రజల్లోకి వెళ్లి తీర్పును కోరనున్నామని చెప్పారు. రాజీనామాలు చేసిన కాంగ్రెస్ నేతలు మనసు మార్చుకుంటారనే భావిస్తున్నానని నారాయణ స్వామి అన్నారు.
Puduchcherry
V Narayanaswami
Kiran Bedi
Resign

More Telugu News