Bigg Boss Hindi: బిగ్ బాస్ హిందీ సీజన్ 14 విజేతగా రుబీనా!

Rubina is the Winner of Biggboss Season 14

  • ధర్మేంద్ర చీఫ్ గెస్ట్ గా గ్రాండ్ ఫినాలే
  • రుబీనాతో పోటీ పడిన రాహుల్ వైద్య
  • రూ. 14 లక్షలతో హౌస్ ను వీడిన రాఖీ సావంత్

ఏ భాషలో అయినా బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో బిగ్ బాస్ ఒకటిగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తొలుత హిందీలో ప్రారంభమై, ఆపై తెలుగు, తమిళం తదితర భాషలకు విస్తరించిన బిగ్ బాస్, హిందీలో 14వ సీజన్ ను పూర్తి చేసుకుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా గత సంవత్సరం అక్టోబర్ లో మొదలైన 14వ సీజన్ గ్రాండ్ ఫినాలే ముగియగా, రుబీనా దిలైక్ విజేతగా నిలిచారు.

ఈ రియాల్టీ షోలో గెలిచిన ఆమెకు రూ. 36 లక్షల ప్రైజ్ మనీని నిర్వాహకులు అందించారు. ట్రోఫీని బహూకరించిన సల్మాన్ ఖాన్, ఆమె భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ షోలో రన్నరప్ గా రాహుల్ వైద్య నిలిచారు. వీరిద్దరి మధ్య తొలి నుంచి తీవ్రమైన పోటీ నెలకొనగా, చివరకు షో చూసే అభిమానులు రుబినాకు మద్దతుగా నిలిచారు. రాహుల్ కన్నా ఆమెకు రెండు శాతం అదనపు ఓట్లు రావడంతో రుబీనానే విజేతగా ప్రకటించారు సల్మాన్ ఖాన్.

ఇక ఫైనల్ లో రుబీనా, రాహుల్ వైద్యలతో పాటు అలీగొని, నిక్కింత బొలి, రాఖీ సావంత్ నిలిచారు. కంటెస్టెంట్లకు చిట్టచివరి టాస్క్ గా రూ. 14 లక్షలు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయే వారు ఎవరైనా ఉంటే, 30 సెకన్లలోపు బజర్ మోగించాలన్న ఆఫర్ ను సల్మాన్ ఇవ్వగా, రాఖీ సావంత్ ముందుకు వచ్చింది. ఆమె రూ. 14 లక్షలతో హౌస్ నుంచి వెళ్లిపోగా, ఆపై అలిగొని ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించిన సల్మాన్, ప్రేక్షకుల ఓటింగ్ మేరకు నిక్కి తంబోలీ కూడా వైదొలగినట్టేనని స్పష్టం చేశాడు.

ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ధర్మేంద్ర వచ్చి, షోలే సినిమాలోని పాప్యులర్ డైలాగులు చెప్పి, ప్రేక్షకులను అలరించారు.

Bigg Boss Hindi
Season 14
Salman Khan
Rubina
Rakhi Sawant
  • Loading...

More Telugu News