Corona Virus: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. 34 రోజుల్లో కోటి మందికిపైగా టీకా!

India Vaccinated over one crore people in 34 days

  • గత నెల 16న మొదలైన వ్యాక్సినేషన్ డ్రైవ్
  • వేగంగా టీకాలు వేస్తున్న దేశాలలో రెండోస్థానం
  • మూడో స్థానంలో బ్రిటన్

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారతదేశం మరో రికార్డు సృష్టించింది. 34 రోజుల్లోనే ఏకంగా కోటిమందికిపైగా టీకాలు వేసిన తొలి దేశంగా రికార్డులకెక్కింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గత నెల 16న దేశవ్యాప్తంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించింది. తొలి విడతలో హెల్త్ వర్కర్లకు టీకాలు వేస్తోంది. ఇటీవల రెండో డోసు టీకాల కార్యక్రమం కూడా ప్రారంభమైంది.

వ్యాక్సినేషన్ విషయంలో మనకంటే ముందు అమెరికా ఉంది. ఆ దేశం 31 రోజుల్లోనే కోటిమందికి టీకా వేసింది. అత్యంత వేగంగా టీకా వేస్తున్న జాబితాలో అమెరికా తర్వాతి స్థానం మనదేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా, భారత్ తర్వాతి స్థానంలో బ్రిటన్ ఉంది. ఆ దేశం 56 రోజుల్లో కోటిమందికి టీకాలు వేసింది. 

Corona Virus
Corona vaccine
India
America
Britain
  • Loading...

More Telugu News