China: గాల్వన్ ఘర్షణకు సంబంధించిన వీడియోను విడుదల చేసిన చైనా!
- గత ఏడాది గాల్వన్‌లో ఘటన
- భారత సైనికులను వెనక్కివెళ్లమన్న చైనా
- దీటుగా సమాధానం ఇచ్చిన భారత్
గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వన్ లో ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడడానికి ముందు కూడా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఇరు దేశాల సైనికులు వీడియో సాక్ష్యాలను తమ దగ్గర పెట్టుకున్నారు. తాజాగా, చైనా మీడియా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది.
భారత సైన్యంతో చైనా సైనికులు వాగ్వివాదానికి దిగడం ఇందులో చూడవచ్చు. సరిహద్దుల వద్ద ఉండొద్దంటూ చైనా సైనికులు వితండవాదం చేశారు. అయితే, భారత భద్రతా బలగాలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చైనా సైనికుల మాటలకు మాటలతోనే దీటుగా సమాధానం ఇచ్చారు. అనంతరం కూడా గాల్వన్ లో చైనా సైనికులు దుందుడుకు చర్యలకు పాల్పడితే వారి చేతలకు చేతలతోనే భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది.