Vijayashanti: చట్టం తెలిసిన వకీళ్ల‌కే రక్షణ లేకపోయింది: విజ‌య‌శాంతి

vijaya shanti slams trs

  • మంథని తీరుగా హత్యలు కాబడుతున్నారు
  • న్యాయంపై కొట్లాడుదామంటే అరెస్టులు చేస్తున్నారు
  • అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మారింది
  • ఎన్నికల హామీ అమలు కాలేదు
  • పింఛన్లు, రైతు బంధు కూడా ఆపుతున్నారు

తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌ట్లేద‌ని బీజేపీ నాయ‌కురాలు విజ‌యశాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేగాక, ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని మండిపడ్డారు.

'అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తం... అని నేటి టీఆర్ఎస్ పాలకులు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మారింది' అని విజ‌య శాంతి విమ‌ర్శించారు.

'ఎన్నికల హామీ అమలు కాలేదు సరికదా... పంటల సాగు కోసం రైతులు తీసుకున్న రుణాల్ని ఐదు రోజుల్లో రెన్యువల్ చేయకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ కోర్టు ఖర్చుల్ని కూడా వారే చెల్లించాలని అన్నదాతలకు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి. ఇది చాలక బ్యాంకులో క్రాప్ లోన్ ఉందంటూ పింఛన్లు, రైతు బంధు కూడా ఆపుతున్నరు' అని విజ‌య శాంతి చెప్పారు.
 
'కొంతమంది రైతుల ఖాతాల నుంచి వడ్లు అమ్ముకున్న పైసల్ని కూడా ఇవ్వక లోన్ కింద జమ చేసుకున్నారు. పింఛన్, రైతు బంధు డబ్బుల్ని బాకీల కింద జమ చేసుకోవద్దని బ్యాంకులకు సర్కారు నుంచి స్పష్టంగా ఆదేశాలున్నప్పటికీ పట్టించుకునే దిక్కులేదు' అని విజ‌య శాంతి ట్వీట్ చేశారు.
 
'ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని పరిస్థితులివి. ఇక రాష్ట్రం మొత్తం మీద పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. నిలదీసి ఏదైనా అడుగుదామంటే.... చట్టం తెలిసిన వకీళ్ళకే రక్షణ లేకపోయింది' అని విజ‌య శాంతి చెప్పారు.
 
'మంథని తీరుగా హత్యలు కాబడుతున్నరు. గుర్రంపోడు లెక్క అన్యాయంపై కొట్లాడుదమంటే అరెస్టులు చేస్తున్నరు, కొట్టి కేసులు పెడుతున్నరన్న భయంతో తెలంగాణ సమాజం ఆందోళన చెందుతోంది' అని విజ‌య శాంతి విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News