Nara Lokesh: చింతమనేని ప్రభాకర్ అరెస్టు.. తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్!

Nara Lokesh responds to Chintamaneni Prabhakar arrest

  • చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్
  • ప్రభాకర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • వివాదంలో లేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్న 

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో ఎన్నికల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు వైసీపీ యూనిఫాం ధరించి ఆ పార్టీ నేతలు చెప్పినట్టు నడుచుకుంటున్నారని, అలాంటి పోలీసు అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బి.సింగవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదం జరిగిన సమయంలో అక్కడ లేని వ్యక్తిని అరెస్ట్ చేయడం, అక్రమ కేసు నమోదు చేయడం రాజారెడ్డి రాజ్యాంగానికి మాత్రమే చెల్లిందని విమర్శించారు.

చింతమనేని అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయనను వెంటనే విడుదల చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు జగన్ పిరికిపంద చర్యలకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో వెంటాడుతున్న ఓటమి భయంతోనే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు మోపి లోపల వేస్తున్నారని విమర్శించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News