IYR Krishna Rao: రాష్ట్రం ఎలా నష్టపోయిందో చెప్ప‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ‌: ఐవైఆర్‌

iyr slams government

  • త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టుల‌ను వదిలేశారు
  • సమస్యలతో కూడిన మెగా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు
  • అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్  హైవే ఒక ఉదాహరణ

కోస్తా, రాయలసీమలను అనుసంధానించే  అనంతపురం- అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ ప‌నులు కొన‌సాగట్లేదంటూ ఈనాడులో వ‌చ్చిన వార్త‌ను పోస్ట్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐదేళ్ల క్రితం ప్రతిపాదించిన ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం సహకరిస్తున్నప్ప‌టికీ ప్రతిపాదనలు మార్చుతుండటంతో ఎడతెగని జాప్యం జరుగుతోందని ఈనాడులో పేర్కొన్న అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.
 
'బాబు గారి పాలనలో సాధ్యమైన త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టుల‌ను వదిలేసి సమస్యలతో కూడిన మెగా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టడం వలన రాష్ట్రం ఎలా నష్టపోయిందో అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్  హైవే ఒక ఉదాహరణ. త్వరగా అమలు చేయడానికి వీలు ఉన్న అనంతపూర్-గుంటూరు జాతీయ రహదారి విస్తీర్ణం ప‌నుల‌నూ వదిలేశారు' అని ఐవైఆర్ కృష్ణారావు విమ‌ర్శించారు.

IYR Krishna Rao
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News