Chandrababu: నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని పోలీసులే బెదిరిస్తుండడం దారుణం: చంద్రబాబు

Chandrababu fires on Kadapa district police

  • పోలీసులు బెదిరింపులకు దిగడం బాధాకరమన్న చంద్రబాబు
  • తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణ
  • సీఐ, అశోక్ రెడ్డి, ఎస్ఐ అనిల్ రెడ్డిలపై ఆగ్రహం
  • చట్టాన్ని మీరి జగన్ కు బానిసలుగా మారారని విమర్శలు

నామినేషన్లు వెనక్కి తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులను పోలీసులే బెదిరిస్తుండడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు బెదిరింపులకు దిగడం బాధాకరమని పేర్కొన్నారు. నంద్యాలపల్లి పంచాయతీ పరిధిలో టీడీపీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ అనిల్ రెడ్డి టీడీపీ మద్దతుదారులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుంటే, కొందరు పోలీసులు బానిసలుగా మారి చట్టాన్ని అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా పోలీసు వ్యవస్థ ఔన్నత్యానికి భంగం కలిగించే విధంగా దుష్టులకు అండగా నిలిచేవారిని ప్రజలు ఉపేక్షించబోరని హెచ్చరించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు మనోధైర్యం వీడరాదని, వైసీపీ అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News