Chandrababu: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలం పెరుగుతుండడంతో వైసీపీ నేతలు అక్రమ కేసులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు: చంద్రబాబు

Chandrababu once again fires in YCP leaders

  • వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం
  • క్రోసూరులో అక్రమ అరెస్టులకు ఖండన
  • ఆవులవారిపాలెంలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్
  • వైసీపీ నేతలకు సిగ్గురావడంలేదని వ్యాఖ్యలు

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు ప్రజాబలం పెరుగుతుండడంతో వైసీపీ నేతలు అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వైసీపీ గూండాల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని తెలిపారు.

ఆవులవారిపాలెంలో అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. పులివెందులలో పంటపొలాలను నాశనం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రోసూరులో టీడీపీ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్టు తెలిపారు. విధ్వంసాలతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతున్నా గానీ వైసీపీ నేతలకు సిగ్గు రావడం లేదని అన్నారు.

Chandrababu
YSRCP Leaders
Gram Panchayat Elections
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News