AP High Court: రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాలపై హైకోర్టు స్టే
- పార్టీలకు సంబంధం లేని రంగులు వేయాలన్న ఆదేశాలు
- ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్
- రేషన్ వాహనాల రంగులపై మార్చి 15న తదుపరి విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డోర్ డెలివరీ వాహనాల రంగులపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలుపుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాటిని వాడొద్దంటూ జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు తాజాగా స్టే విధించింది.
ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ వేసిన ఈ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపి, ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే విధించింది. రేషన్ వాహనాల రంగుల అంశంపై మార్చి 15న తదుపరి విచారణ జరుపుతామని చెప్పింది.
కాగా, రేషన్ వాహనాలపై వైసీపీ రంగులు ఉన్నాయని ఎస్‌ఈసీ ఇటీవల అభిప్రాయపడిన విషయం తెలిసిందే. పార్టీలకు సంబంధం లేకుండా ఉండే రంగులు వేయాలని ఇటీవల ఎస్ఈసీ సంబంధిత అధికారులకు సూచించింది.