Local Body Polls: వ‌చ్చే నెల 10 నుంచి ఏపీ‌లో మునిసిపల్‌ ఎన్నికలు

municipal elections schedule releases
  • షెడ్యూల్ విడుద‌ల చేసిన ఎస్ఈసీ
  • మొత్తం 12 మునిసిపల్‌ కార్పొరేషన్లలో ఎన్నిక‌లు
  • 75 మునిసిపల్‌, నగర పంచాయతీలకు పోలింగ్
ఏపీ‌లో మునిసిపల్‌ ఎన్నిక‌ల‌ను వ‌చ్చే నెల 10న నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది.  గతంలో ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ నిలిచిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచే దీన్ని కొన‌సాగించాల‌ని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 75 మునిసిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.  వ‌చ్చేనెల‌ 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ‌కు గ‌డువు ఉంది.

కాగా, గత ఏడాది మార్చి 23న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జ‌ర‌పాల‌ని ఏర్పాట్లు చేసుకోగా క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా వాయిదాప‌డ్డ విష‌యం  తెలిసిందే. అప్ప‌టికే 12 నగరపాలక సంస్థల్లో అభ్యర్థులు  6,563 మంది నామినేషన్లు దాఖ‌లు చేశారు.

అలాగే, 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు వేశారు. మ‌రోవైపు, ప్రస్తుతం పంచాయతీలకు ఎన్నికలు జ‌రుగుతున్నాయి. తొలి రెండు ద‌శ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ పూర్తయింది. ఈ నేప‌థ్యంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు కూడా ఎస్ఈసీ సిద్ధ‌మ‌యింది.
Local Body Polls
Andhra Pradesh

More Telugu News