Donkeys: వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ గాడిదలకు పెళ్లి... వీడియో ఇదిగో!

Donkeys wedding against valentines day in Karnataka

  • నేడు ప్రేమికుల దినోత్సవం
  • మన సంస్కృతికి వ్యతిరేకం అంటున్న సంప్రదాయవాదులు
  • వాలంటైన్స్ డేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందుత్వ సంఘాలు
  • కర్ణాటకలో భాజభజంత్రీలతో గాడిదలకు పెళ్లి  

భారత్ సనాతన ధర్మాన్ని పాటించే దేశమని, ఇక్కడ వాలంటైన్స్ డే నిర్వహించడం తగదని సంప్రదాయవాదులు ఎప్పట్నించో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వాలంటైన్స్ డే నాడు హిందుత్వ సంఘాలు ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీకాదు. ఆ రోజు బయట జంటగా కనిపిస్తే పెళ్లి చేస్తామని చెప్పడమే కాదు, కొన్ని ప్రాంతాల్లో అన్నంత పనీ చేశాయి.

అయితే కర్ణాటకలో అందుకు భిన్నంగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గాడిదలకు పెళ్లి చేశారు. భాజాభజంత్రీలతో నిజమైన పెళ్లికి తీసిపోని రీతిలో రెండు గాడిదలకు వివాహ తంతు జరిపించారు. దేశ సంస్కృతికి వ్యతిరేకమైన వాలంటైన్స్ డేను జరుపుకోవద్దని స్పష్టం చేశారు. యువత తప్పుదారి పట్టొద్దని, కన్నడ సంప్రదాయాలను నాశనం చేయొద్దని సంప్రదాయవాదులు హితవు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సందడి చేస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News