SI Madhu Prasad: కానిస్టేబుళ్ల నుంచి తప్పించుకోబోయి ఎస్సైని ఢీకొట్టిన బైకర్... ఆసుపత్రిపాలైన ఎస్సై

Biker hits SI while police checking vehicles

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవాంఛనీయ ఘటన
  • ఎస్సై మధుప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ
  • బైక్ పై దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు
  • యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో ఎస్సైని ఢీకొట్టిన వైనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాహనాల తనిఖీ సందర్భంగా అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అశ్వారావు పేట మండలం ఉట్లపల్లి వద్ద ఎస్సై మధుప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కానిస్టేబుళ్లు రోడ్డుపై వస్తున్న వాహనాలను నిలిపివేస్తుండగా, ఎస్పై మధుప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.

ఇంతలో ఇద్దరు యువకులు బైక్ పై వేగంగా వచ్చారు. రోడ్డుపై ఉన్న కానిస్టేబుళ్లను చూసి తప్పించుకునేందుకు ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న ఎస్పైని గమనించలేదు. యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో నేరుగా ఎస్సైనే ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎస్సై మధుప్రసాద్ గాయపడడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

SI Madhu Prasad
Bike
Checking
Ashwaraopeta
Bhadradri Kothagudem District
  • Loading...

More Telugu News