Sajjala Ramakrishna Reddy: ఈ ఫలితాలు మేం ఊహించినవే: సజ్జల

Sajjala opines on AP Panchayat election results

  • ఏపీలో ముగిసిన తొలి, రెండో విడత పంచాయతీ ఎన్నికలు
  • తమ అంచనాల మేరకు ఫలితాలు వచ్చాయన్న సజ్జల
  • 80 శాతం వైసీపీ మద్దతుదారులే గెలిచారని వెల్లడి
  • విజేతల ఫొటోలు వెబ్ సైట్లో ఉంచుతున్నామన్న సజ్జల

ఏపీలో ఇప్పటివరకు రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాము ఊహించినట్టే ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ తమ అంచనాలు నిజమయ్యాయని చెప్పారు. 80 శాతం పంచాయతీల్లో తమ మద్దతుదారులే గెలిచారని తెలిపారు. గెలిచిన అభ్యర్థుల ఫొటోలను వెబ్ సైట్లో ఉంచుతున్నామని పేర్కొన్నారు.  

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో హింస, దౌర్జన్యం ఎక్కడ జరిగిందో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకే టీడీపీ ఆరోపణలు చేస్తోందని అన్నారు. వైఎస్సార్ డాట్ కామ్ వెబ్ సైట్ సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy
Gram Panchayat Elections
Results
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News