Ram Nath Kovind: క‌ర్నూలులో ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాష్ట్రప‌తి స‌హా ప్ర‌ముఖుల దిగ్భ్రాంతి

president mourn for drath

  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి:  కోవింద్
  • మృతుల కుటుంబాలకు వెంక‌య్య‌ సానుభూతి
  • ప్ర‌మాద ఘ‌ట‌న‌పై జ‌గ‌న్, చంద్ర‌బాబు, ప‌వ‌న్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ప‌లువురు సంతాపం తెలిపారు.

'ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళలు, ఓ చిన్నారి సహా యాత్రికులు మృతి చెందడం హృదయ విదారకంగా ఉంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని కోవింద్ తెలుగులో ట్వీట్ చేశారు.

'ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని ఉప రాష్ట్రప‌తి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

ప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయ‌న‌.. బాధితులకు సహాయం  అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  

 ప్ర‌మాదంలో మృతుల కుటుంబాలకు బీజేపీ నేత‌లు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Ram Nath Kovind
Chandrababu
Jagan
  • Loading...

More Telugu News