Madhya Pradesh: తన పొలానికి దారి లేదట... హెలికాప్టర్ కొనేందుకు డబ్బు కావాలని రాష్ట్రపతికి మహిళ లేఖ!

Women Letter to President Kovind for Helecopter
  • మధ్యప్రదేశ్ లో బసంతీ బాయ్ కి రెండెకరాలు పొలం
  • దారిని ఆక్రమించిన ఆసామి
  • విషయం తెలుసుకుని దారిని ఇప్పిస్తానన్న ఎమ్మెల్యే
తన పొలంలోకి వెళ్లేందుకు మార్గం లేదని, తనకు లోన్ ఇప్పిస్తే, ఓ హెలికాప్టర్ కొనుక్కుంటానని ఏకంగా రాష్ట్రపతికి మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేస్తూ లేఖను రాయడం చర్చనీయాంశమైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మాండ్ సౌర్ జిల్లా, లోహర్ కు చెందిన బసంతీ బాయ్ అనే మహిళకు రెండు ఎకరాల పొలం ఉంది.

ఆ ఊరి ఆసామి ఒకరికి ఆ పొలం పక్కనే భూమి ఉండటంతో బసంతీ రాయ్ తన పొలంలోకి వెళ్లే మార్గాన్ని మూసేశాడు. తనకు న్యాయం చేయాలని ఆమె ఎంతో కాలం పాటు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆమె రాష్ట్రపతికి లేఖను రాసింది. తనకు ఓ హెలికాప్టర్ కావాలని, దాన్ని కొనేందుకు రుణం ఇప్పించాలని కోరింది.

ఇక ఈ విషయం చర్చనీయాంశం కాగా, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీంతో ఆమెకు సాయపడాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, అది హెలికాప్టర్ ను కొనుగోలు చేసేందుకు కాదు సుమా! ఆమె పొలంలోకి దారిని ఇప్పిస్తానని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

Madhya Pradesh
Land
Helecopter
Ram Nath Kovind
Letter

More Telugu News