Andhra Pradesh: కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలు... 64.75 శాతం పోలింగ్ నమోదు

AP Second Phase Panchayat Elections

  • ఏపీలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
  • 2,786 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
  • 20,817 వార్డు స్థానాలకు ఎన్నికలు
  • ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్

ఏపీలో ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో ఏకగ్రీవం కాగా మిగిలిన 2,786 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 20,817 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 44,876 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు మినహా  ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతోంది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వివరాలు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు.

జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది...

విజయనగరం- 71.5
అనంతపురం- 70.32
కర్నూలు- 69.61
గుంటూరు- 69.08
చిత్తూరు- 67.20
కృష్ణా- 66.64
ప్రకాశం- 65.15
కడప- 64.28
విశాఖ- 64.28
పశ్చిమ గోదావరి- 63.54
తూర్పు గోదావరి- 60.90
నెల్లూరు- 59.92
శ్రీకాకుళం- 51.30

Andhra Pradesh
Gram Panchayat Elections
Second Phase
Polling
  • Loading...

More Telugu News