KCR: మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

KCR Effigy burnt by BJP Mahila Morcha
  • హాలియా సభలో మహిళలను కించపరిచేలా మాట్లాడారన్న బీజేపీ
  • బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉప్పల్‌లో దిష్టిబొమ్మ దహనం
  • ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ అనర్హుడన్న మహిళా నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వరంలో నిన్న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మొన్న హాలియాలో భారీ బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్ మహిళలను కించపరిచేలా మాట్లాడారని బీజేపీ మహిళా మోర్చా మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఆరోపించారు. మహిళలను కించపరిచిన కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హులని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
KCR
effigy
BJP
Hyderabad

More Telugu News