ఏపీ సీఎస్, డీజీపీలను అభినందించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్
- ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి
- విజయవాడలో ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లిన సీఎస్, డీజీపీ
- నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో సమావేశం
- మిగిలిన విడతల ఎన్నికలపై చర్చ
అంతేకాదు, మిగిలిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల నిర్వహణపైనా ఎస్ఈసీ... సీఎస్, డీజీపీలతో చర్చించారు. అనుసరించాల్సిన విధివిధానాలపై రాష్ట్ర ఉన్నతాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాగా, ఈ సమావేశంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ మధ్య పలు సందర్భాల్లో నవ్వులు విరబూశాయి.