Farm Laws: 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటలపాటు రైల్‌రోకోకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

Farmers called Rail Roko on February 18 for 4 hours

  • ఇటీవల దేశవ్యాప్తంగా మూడు గంటలపాటు రోడ్ల దిగ్బంధనం
  • 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు రైల్‌రోకో
  • చట్టాల ఉపసంహరణకు అక్టోబరు 2 వరకు ప్రభుత్వానికి గడువు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు ఈ నెల 18 దేశవ్యాప్తంగా నాలుగు గంటలపాటు రైల్‌రోకోకు పిలుపునిచ్చారు. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు రైల్‌రోకో నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పొట్ట కొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ పంజాబ్,  హర్యానా, పశ్చిమ యూపీ రైతులు వేలాదిమంది 76 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు.

రైతులతో ఆందోళన విరమింపజేసేందుకు ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో  ఇటీవల మూడు గంటలపాటు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చిన ఎస్‌కేఎం తాజాగా రైల్‌రోకోకు పిలుపునిచ్చింది. కాగా, చట్టాల ఉపసంహరణకు గాంధీ జయంతి వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News