Shahnawaz Hussain: బీహార్‌లో పూర్తయిన మంత్రివర్గ విస్తరణ.. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్‌కు స్థానం

Nitish took Shahnawaz Hussain into his cabinet

  • ఇటీవల శాసనమండలికి షానవాజ్ 
  • ఇప్పుడు మంత్రివర్గంలోకి
  • కేబినెట్‌లో 20కి పెరిగిన బీజేపీ మంత్రుల సంఖ్య

బీహార్ శాసనమండలికి ఇటీవల అనూహ్యంగా ఎంపికైన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్‌కు బీహార్ కేబినెట్‌లో చోటు లభించింది.  ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిన్న మంత్రివర్గ విస్తరణ చేపట్టి కొత్తగా 17 మందికి కేబినెట్‌లో చోటు కల్పించారు. వీరిలో 9 మంది బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో కేబినెట్‌లో ఉన్న బీజేపీ మంత్రుల సంఖ్య 20కి పెరిగింది. జేడీయూ ఎమ్మెల్యేల్లో 8 మందికి కొత్తగా మంత్రివర్గంలో చోటు లభించింది. దీంతో ఆ పార్టీ మంత్రుల సంఖ్య 12కు చేరింది. తాజా విస్తరణతో కలుపుకుని నితీశ్ కేబినెట్‌లో మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరుకోగా, మరో ఇద్దరినీ తీసుకునే వీలుంది.

Shahnawaz Hussain
Bihar
Cabinet
Nitish Kumar
  • Loading...

More Telugu News