Uttarakhand: ఉత్తరాఖండ్ విలయంలో 32కు చేరిన మృతుల సంఖ్య.. మరో ఆరు మృతదేహాలు లభ్యం

Uttarakhand glacier disaster rescue operations continue

  • గల్లంతైన 171 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
  • విద్యుత్ కేంద్రం సొరంగంలో చిక్కుకుపోయిన వారు బతికి ఉండే అవకాశం ఉందన్న అధికారులు
  • 13 బాధిత గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ

ఉత్తరాఖండ్ విలయంలో  గల్లంలైన 171 మంది ఆచూకీ కోసం వెతుకుతున్న సహాయక బృందాలు నిన్న మరో ఆరు మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకొచ్చాయి. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 32కు చేరింది.

 రెండున్నర కిలోమీటర్ల పొడవు వుండే జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు ప్రారంభించిన ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు 120 మీటర్ల మేర బురద, ఇతర వ్యర్థాలను తొలగించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని సంప్రదించడం ఇప్పటి వరకు సాధ్యం కాకపోయినా, వారు ప్రాణాలతోనే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, వంతెన కొట్టుకుపోయిన కారణంగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన 13 గ్రామాల ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకులను అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News