Rajinikanth: ఫోన్ చేసి శశికళ ఆరోగ్యం గురించి ఆరా తీసిన రజనీకాంత్

Rajikanth telephones Sasikala

  • రజనీకాంత్ ఫోన్ చేశారని వెల్లడించిన దినకరన్
  • ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి
  • సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిపోయారని వ్యాఖ్య

దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జైలు శిక్షను పూర్తి చేసుకుని విడుదలైన సంగతి తెలిసిందే. ఆమె చెన్నై చేరుకోవడంతో తమిళనాట రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇదే సమయంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ శశికళకు ఫోన్ చేసి, ఆమె ఆరోగ్యం గురించి కనుక్కున్నారు.

ఈ విషయాన్ని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వెల్లడించారు. రజనీకాంత్ తమకు ఫోన్ చేశారని, చిన్నమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీశారని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం చిన్నమ్మ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమె అలసిపోయారని చెప్పారు. మరోవైపు శశికళకు రజనీ ఫోన్ చేయడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ కోణం ఉందా? అనే చర్చ జరుగుతోంది.

Rajinikanth
Sasikala
TTV Dinakaran
Kollywood
  • Loading...

More Telugu News