Varla Ramaiah: అదే సీఎం జ‌గ‌న్ ప్రధాన లక్ష్యం: వ‌ర్ల రామ‌య్య‌

varla ramaiah slams jagan

  • అమరావతి ఎటు పోయినా స‌రే
  • విశాఖ స్టీల్ ఏ గంగలో మునిగినా ప‌ట్టించుకోరు
  • పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోయినా స‌రే
  • ప్ర‌ధాన‌ లక్ష్యం మాత్రం చంద్రబాబును సాధించడమే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో ప‌రిస్థితులు ఎంత దిగ‌జారి పోతున్నా జ‌గ‌న్ మాత్రం వాటిని ప‌ట్టించుకోకుండా త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడిని సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

'అమరావతి ఎటు పోయినా, విశాఖ స్టీల్ ఏ గంగలో మునిగినా, పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా మారినా, విద్యార్థులు ఉద్యోగాలు లేక రోజుకూలీలుగా మారుతున్నా, ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం మాత్రం చంద్రబాబును సాధించడమే. అదే, ఆయన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కూడా' అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Varla Ramaiah
Telugudesam
Jagan
  • Loading...

More Telugu News