Poultry legend: ‘పౌల్ట్రీ లెజెండ్’ పెద్ద శేషయ్య కన్నుమూత
- 1973లో ఉద్యోగానికి రాజీనామా
- 50 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన పెద్ద శేషయ్య
- 2015లో పౌల్ట్రీ లెజెండ్ అవార్డు
పౌల్ట్రీరంగ నిపుణుడు మన్నవ పెద్దశేషయ్య (87) నిన్న ఉదయం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందిన పెద్ద శేషయ్య వైద్య, ఆరోగ్యశాఖలో కొంతకాలం పనిచేశారు. 1968లో ఆయన భార్య నాగరత్నమ్మ సరూర్‌నగర్‌లో పౌల్ట్రీఫాం ప్రారంభించగా, 1973లో ఉద్యోగానికి రాజీనామా చేసిన శేషయ్య పౌల్ట్రీఫాంను విస్తరించారు. దానిని రత్నం పౌల్ట్రీ ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చారు.
50 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన పౌల్ట్రీరంగ పితామహుడు డాక్టర్ బీవీ రావు చైర్మన్‌గా వ్యవహరించిన వెంకటేశ్వర హేచరీస్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్‌లో ముఖ్యమైన హోదాల్లో పనిచేశారు. 2015లో ‘పౌల్ట్రీ లెజెండ్’ అవార్డును అందుకున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.