Rafale Jets: రాఫెల్ యుద్ధ విమానాలపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

India to have 17 Rafale jets by March says Rajnath Singh

  • ఇప్పటి వరకు 11 రాఫెల్ విమానాలు వచ్చాయి
  • వచ్చే నెల నాటికి వాటి సంఖ్య 17కు చేరుతుంది
  • వచ్చే ఏడాదికి మొత్తం 36 విమానాలు మన గడ్డపై ఉంటాయి

ఫ్రాన్స్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలతో భారత వాయుసేన బలం అమాంతం పెరిగిపోయింది. శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టించేంత అత్యాధునిక టెక్నాలజీ ఈ విమానాల సొంతం అనే విషయం తెలిసిందే. ఈరోజు రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, కీలక ప్రకటన చేశారు.

 వచ్చే నెల నాటికి మన గడ్డపై 17 రాఫెల్ జెట్స్ ఉంటాయని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 11 విమానాలు వచ్చాయని చెప్పారు. వచ్చే ఏడాదికల్లా మొత్తం విమానాలు (36) భారత్ కు చేరుకుంటాయని అన్నారు. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాచారాన్ని వెల్లడించారు.

ఫ్రాన్స్ తో రూ. 59 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 10న తొలి రాఫెల్ భారత్ కు వచ్చింది.

  • Loading...

More Telugu News