Chittoor District: ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎస్ఈసీ

AP SEC gives green signal to unanimous winners

  • గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు
  • గతంలో ఏకగ్రీవాలను ప్రకటించవద్దని ఆదేశించిన ఎస్ఈసీ
  • ఏకగ్రీవం అయిన వారికి డిక్లరేషన్ ఇవ్వాలని తాజా ఆదేశాలు

ఏపీ పంచాయతీ ఎన్నికలకు రేపు తొలివిడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు గుంటూరు, చిత్తూరు జిల్లాలలో పెద్ద సంఖ్యలో జరిగిన ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే.

ఆయా ఏకగ్రీవాలను అధికారికంగా ప్రకటించవద్దని జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు జిల్లాల ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకగ్రీవం అయిన అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించింది. ఏకగ్రీవం అయిన అందరికీ రేపో, ఎల్లుండో డిక్లరేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Chittoor District
Guntur District
Gram Panchayat Elections
Unanimous
  • Loading...

More Telugu News