Sasikala: త‌మిళ‌నాడుకు ప‌య‌న‌మైన శ‌శిక‌ళ‌.. పెరిగిన ఉత్కంఠ‌!

Expelled AIADMK leader VK Sasikala leaves for Tamil Nadu

  • బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరిన చిన్న‌మ్మ‌
  • భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చిన అభిమానులు
  • త‌మిళ‌నాడులోనూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు

బెంగ‌ళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్‌షైర్ క్లబ్ నుంచి అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కారులో త‌మిళ‌నాడుకు బ‌య‌లుదేరారు. ఇటీవ‌లే ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన చిన్న‌మ్మ కొన్నిరోజుల పాటు ప్రెస్టీజ్ గోల్ఫ్‌షైర్ క్లబ్ లో విశ్రాంతి తీసుకున్న‌ విష‌యం తెలిసిందే.

ఆమె అక్క‌డి నుంచి త‌మిళ‌నాడుకు వెళ్తున్న స‌మ‌యంలో త‌మిళ‌నాడులో ఆమె మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున పోస్ట‌ర్లు ఏర్పాటు చేశారు. బెంగ‌ళూరులో ఆమె బ‌య‌లుదేరుతోన్న స‌మ‌యంలోనూ ఆమెను చూసేందుకు చాలా మంది త‌ర‌లి వ‌చ్చారు.

అంత‌కుముందు ఆమె జ‌య‌ల‌లిత ఫొటోముందు నిలుచుని నివాళులు అర్పించారు. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలోనే ఆమె విడుదల కావ‌డం, నాలుగేళ్ల త‌ర్వాత‌ తిరిగి ‌త‌మిళ‌నాడుకు వెళుతుండడం ప‌ట్ల ఉత్కంఠ నెల‌కొంది. నాలుగేళ్ల క్రితం ఎన్నో నాటకీయ ప‌రిణామాల మ‌ధ్య ఆమె కోర్టులో లొంగిపోవ‌డానికి బెంగ‌ళూరుకు వెళ్లిన విష‌యం తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News