Ganta Srinivasa Rao: మోదీకి జ‌గ‌న్ రాసిన లేఖ‌ను స్వాగ‌తిస్తున్నాను: గంటా శ్రీనివాస‌రావు

jagan should discuss with modi says ganta

  • విశాఖ‌ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా లేఖ రాశారు
  • సలహాలు, పరిష్కారాలను తెలిపారు
  • అయితే, స్వ‌యంగా వెళ్లి క‌ల‌వాలి

విశాఖ‌ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు సలహాలు, పరిష్కారాలతో ప్రధాని మోదీకి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్ లేఖ రాయడాన్ని తాను స్వాగ‌తిస్తున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్వీట్లు చేశారు.

'సొంత ఇనుప ఖనిజం గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీలుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజిలో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటివి పరిష్కార మార్గాలు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను' అని గంటా అన్నారు.

'అయితే కేంద్రం ఇప్పటికే పాలసీ తీసుకున్నందున లేఖతో పాటు ముఖ్యమంత్రి గారు స్వ‌యంగా వెళ్లి ప్రధానిని కలిసి వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించి విశాఖ, తెలుగు ప్రజల మనోభావాలను వివరించి ప్రధానిని ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని కోరుతున్నాను' అని గంటా కోరారు.


Ganta Srinivasa Rao
Telugudesam
Jagan
Narendra Modi
Vizag
  • Error fetching data: Network response was not ok

More Telugu News