Jabardasth: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్!

police files case against tanmai

  • నిన్న రాత్రి ఘ‌ట‌న‌
  • పోలీసుల‌కు చిక్కిన తన్మయి, ప‌లువురు ఈవెంట్ మేనేజ‌ర్లు
  • వాహ‌నాల స్వాధీనం

హైద‌రాబాద్‌లో మద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు జబర్దస్త్‌ కామెడీ షో కమెడియన్‌ తన్మయి‌. ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఆ కామెడీ షాలో లేడీ గెటప్‌లు వేసి త‌న్మ‌యి మంచి గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.

నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లో ఈవెంట్ ఆర్గనైజర్లతో క‌లిసి ఆయ‌న మ‌ద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ, పోలీసులకు దొరికిపోయారు. కాగా, గ‌త రాత్రి చేసిన డ్రంకెన్ డ్రైవుల్లో చాలా మంది పోలీసులకు చిక్కారు. ఈ తనిఖీల్లో ఐదు కార్లు, రెండు ఆటోలతో పాటు 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారంద‌రిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వ‌నున్నారు.

  • Loading...

More Telugu News