Farm Laws: రైతు ఉద్యమంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం

OHCHR responds about Farmers Protest in Delhi
  • అధికార  యంత్రాంగం, రైతులు సంయమనం పాటించాలి
  • అన్ని వర్గాల మానవహక్కులను కాపాడాలి
  • ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి
దేశంలో జరుగుతున్న రైతుల ఉద్యమంపై  ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ కార్యాలయం (ఓహెచ్‌సీహెచ్ఆర్) స్పందించింది. ఉద్యమకారులు, అధికార యంత్రాంగం సంయమనం పాటించాలని సూచించింది. అన్ని వర్గాల మానవ హక్కులను కాపాడుతూ, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఓ ట్వీట్‌లో ఆకాంక్షించింది.

మరోవైపు, రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన ప్రముఖ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్, పాప్ సింగర్ రిహన్నా తదితరులపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ సహా పలువురు విరుచుకుపడ్డారు. గ్రెటాపై ఢిల్లీలో కేసు కూడా నమోదైంది. కాగా, రైతులు తమ హక్కుల సాధనలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రాస్తారోకో నిర్వహించనున్నారు.
Farm Laws
Farmers
Protest
UNO
OHCHR

More Telugu News