Lella Appireddy: మేనిఫెస్టో విడుదల చేసినందుకు చర్యలు తీసుకోండి.... చంద్రబాబుపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

YCP leaders met SEC and asked to take action on Chandrababu

  • పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు
  • వైసీపీ ఆగ్రహం.. ఎస్ఈసీకి ఫిర్యాదు
  • మేనిఫెస్టో రద్దు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు
  • చంద్రబాబుపై కేసు నమోదు చేయాల్సిందేనంటున్న వైసీపీ

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. పల్లె ప్రగతి-పంచ సూత్రాలు పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోపై వైసీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దాంతో మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలని టీడీపీని ఎస్ఈసీ ఆదేశించారు. అయితే, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా మేనిఫెస్టో విడుదల చేశారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

ఎస్ఈసీకి ఫిర్యాదు చేయడంపై లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సంగతిని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఎస్ఈసీ ఆ మేనిఫెస్టో రద్దు చేసి అంతటితో సరిపెట్టారని ఆరోపించారు. దాంతో తాము చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని కోరామని అప్పిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఎస్ఈసీకి వినతిపత్రం అందించామని తెలిపారు.

  • Loading...

More Telugu News