Roja: నిమ్మగడ్డ తీరు చూస్తుంటే చిన్నమెదడు చితికిపోయినట్టు అనుమానంగా ఉంది: రోజా

YCP MLA Roja ridicules SEC Nimmgadda actions

  • నిమ్మగడ్డపై ధ్వజమెత్తిన రోజా
  • కలెక్టర్లు, ఎస్పీలను మార్చివేస్తున్నారని ఆరోపణలు
  • చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నాడని వ్యాఖ్యలు
  • తనపై తానే నమ్మకం కోల్పోయాడని విమర్శలు

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ ప్రవర్తన చూస్తుంటే చిన్నమెదడు చితికిపోయినట్టు అనుమానంగా ఉందని అన్నారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను, ఎస్పీలను మార్చివేసి, తనకు అనుకూలమైన వ్యక్తులను తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు అయితే వాటిని పక్కన పెట్టేయాలంటున్నాడని, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నిమ్మగడ్డ తనపై తానే నమ్మకం కోల్పోయినట్టు అనిపిస్తోందని విమర్శించారు. నిమ్మగడ్డ... చంద్రబాబు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నాడని, తన అక్కసు వెళ్లగక్కుతున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్ పరిపాలన మెచ్చి పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. 

Roja
Nimmagadda Ramesh Kumar
SEC
Gram Panchayat Elections
Andhra Pradesh
  • Loading...

More Telugu News