Peddireddi Ramachandra Reddy: ఎస్ఈసీ మాటలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవు: జిల్లా అధికారులకు పెద్దిరెడ్డి వార్నింగ్

AP Minister Peddireddy warns district officials

  • ఏపీలో పంచాయతీ ఎన్నికల రగడ
  • జిల్లా అధికారులపై పెద్దిరెడ్డి అసంతృప్తి
  • ఎన్నికల నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ
  • నిమ్మగడ్డ పరిధి మీరుతున్నారని వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులపై ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. అధికారులు ఏకగ్రీవాలకు వెంటనే డిక్లరేషన్ లు ఇవ్వాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా, చిత్తూరు, గుంటూరు జిల్లాల అధికారులు ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని తెలిపారు. జిల్లా అధికారులను ఎస్ఈసీ భయపెడుతున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు ఎస్ఈసీ మాటలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నంతకాలం అలాంటి అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని అన్నారు.

Peddireddi Ramachandra Reddy
District Officials
SEC
Gram Panchayat Elections
Andhra Pradesh
  • Loading...

More Telugu News