Raviteja: పూరి, రవితేజ కాంబినేషన్లో మరో సినిమా?

Puri to direct Raviteja again

  • రవితేజ, పూరి కలయికలో పలు హిట్స్ 
  • తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ సినిమా  
  • కథను సిద్ధం చేసిన దర్శకుడు పూరి

రవితేజ కెరీర్లో దర్శకుడు పూరి జగన్నాథ్ పాత్ర కీలకమైనది. తను సోలో హీరోగా ఓ మంచి గుర్తింపు.. సక్సెస్ తెచ్చుకున్నది పూరీ జగన్నాథ్ సినిమాల ద్వారానే అన్న విషయం చాలా మందికి తెలుసు. 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'ఇడియట్', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'.. వంటి సినిమాల ద్వారా రవితేజకు మంచి విజయాలను ఇవ్వడమే కాకుండా.. హీరోగా ఆయన ఇమేజ్ ను పెంచే పాత్రలను కూడా పూరి ఇచ్చాడు.

అయితే, 'దేవుడు చేసిన మనుషులు' సినిమా తర్వాత వీరి కలయికలో మళ్లీ సినిమా రాలేదు. అంటే సుమారు తొమ్మిదేళ్ల నుంచి వీరిద్దరూ కలసి పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన కథను కూడా పూరి ఇప్పటికే సిద్ధం చేసినట్టు, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరి 'లైగర్' సినిమా చేస్తుండగా.. రమేశ్ వర్మతో రవితేజ 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజక్టులు పూర్తయ్యాక వీరిద్దరి కలయికలో సినిమా సెట్స్ కి వెళుతుందని సమాచారం.

Raviteja
Puri Jagannadh
Vijay Devarakonda
Ramesh Varma
  • Loading...

More Telugu News