Ramya Krishna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Ramya Krishna completes her shoot for Republic

  • 'రిపబ్లిక్' షూటింగ్ పూర్తిచేసిన రమ్యకృష్ణ 
  • కేరళ అడవులకు వెళ్లనున్న 'పుష్ప'
  • 'ముంబైకర్' షూటింగులో విజయ్ సేతుపతి    

*  సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న 'రిపబ్లిక్' సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్నటితో ఆమె తన షూటింగ్ పార్టును పూర్తి చేసినట్టు దర్శకుడు తెలిపారు. ఆమెతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉందని ఆయన పేర్కొన్నాడు. జూన్ 4న రిలీజయ్యే ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.
*  అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం మారేడుమిల్లి షెడ్యూలు ఇటీవలే పూర్తయింది. ఈ షెడ్యూలులో కొన్ని సన్నివేశాలు, ఓ యాక్షన్ ఎపిసోడ్, ఒక పాటను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూలును కేరళ అడవుల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తోంది.
*  ప్రముఖ కెమేరామెన్ సంతోష్ శివన్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న హిందీ చిత్రం 'ముంబైకర్'. జనవరి 10న మొదలైన ఈ చిత్రం షూటింగును సింగిల్ షెడ్యూలులో పూర్తి చేస్తున్నారు. ఎక్కువగా రాత్రి వేళల్లో షూటింగ్ చేస్తున్నారట.

Ramya Krishna
Allu Arjun
Rashmika Mandanna
Vijay Setupati
  • Loading...

More Telugu News