Varla Ramaiah: జగన్ కోర్టుకెళ్లడు, విచారణ ముందుకు సాగదు... న్యాయమా నువ్వెక్కడ?: వర్ల రామయ్య వ్యాఖ్యలు

Varla Ramaiah comments

  • పులివెందుల కోర్టుకు వచ్చిన సీబీఐ అధికారులు
  • వివేకా హత్య కేసు వివరాలు కోరిన వైనం
  • ఈ నేపథ్యంలో వర్ల రామయ్య స్పందన
  • దర్యాప్తు ఎప్పటికి పూర్తయ్యేనో అంటూ వ్యాఖ్యలు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల బృందం ఇవాళ పులివెందుల చేరుకుంది.  గతంలో వివేకా హత్య కేసులో నమోదు చేసిన వివరాలు కావాలంటూ పులివెందుల న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు.

సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ, సీబీఐతో వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఎప్పటికి పూర్తయ్యేనో ఆ దేవుడికే తెలియాలి అని వ్యాఖ్యానించారు. జగన్ పై సీబీఐ చార్జిషీట్లు వేసి పదేళ్లయిందని, ఆయన కోర్టుకు వెళ్లడు, విచారణ ముందుకు సాగదు అన్నారు. ఇటు, వివేకా హత్యకు రెండేళ్లయిది, ఇంతవరకు దర్యాప్తు పూర్తి కాలేదు... న్యాయమా నువ్వెక్కడ? అంటూ వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు.

Varla Ramaiah
Jagan
YS Vivekananda Reddy
CBI
Pulivendula
  • Loading...

More Telugu News