Javed Bajwa: భారత్ తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు: పాకిస్థాన్

Dont want war with India says Pakistan Army Chief

  • ఇరు దేశాలు శాంతియుతంగా ఉండాలనేదే తమ ఆకాంక్ష అన్న పాక్ ఆర్మీ చీఫ్
  • తమ దేశ అభివృద్ధిని కోరుకుంటున్నామని వ్యాఖ్య
  • పరస్పర గౌరవానికే పాక్ ప్రాధాన్యతను ఇస్తుందన్న బజ్వా

భారత్ పై ఎప్పుడూ ఏదో ఒక కుట్రకు పాల్పడే పాకిస్థాన్ శాంతి వచనాలు పలికింది. తమది శాంతిని కోరుకునే దేశమని ఆ దేశ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా అన్నారు. భారత్ తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఇరు దేశాలు శాంతియుతంగా కలిసి సాగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. అన్ని దేశాలకు స్నేహ హస్తాన్ని చాచాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తన ప్రకటనలకు పెడార్థాలు తీయవద్దని కోరారు. పాకిస్థాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, దేశ అభివృద్ధిని కోరుకుంటోందని చెప్పారు. కశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని అన్నారు. కయ్యాలకు కాలు దువ్వడం కంటే, పరస్పర గౌరవానికే పాకిస్థాన్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. రావల్పిండిలో జరిగిన వైమానిక దళానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News