Nimmagadda Ramesh: ఆ ఎంపీడీవోలు అందరినీ బదిలీ చేయండి: సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ

SEC Nimmagadda orders to transfer MPDOs
  • గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిమ్మగడ్డ దృష్టి
  • ఏకగ్రీవాలు జరిగిన చోట ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఆదేశాలు
  • చిత్తూరు జిల్లాలో 30 మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఆదేశం
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మరో లేఖ రాశారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలపై లేఖలో ఆయన సరికొత్త ఆదేశాలను జారీ చేశారు. ఏకగ్రీవాలు జరిగిన ప్రాంతాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 30 మంది ఎంపీడీవోలను ట్రాన్స్ ఫర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నిమ్మగడ్డ పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నిర్ణయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఆయన పర్యటిస్తూ సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
Nimmagadda Ramesh
SEC
CS
Letter
MPDO

More Telugu News