Anasuya: 'ఖిలాడి'లో అనసూయ.. ఆహ్వానిస్తూ పోస్టర్!

Anasuya in Ravitejas Khiladi

  • ఇటీవలి కాలంలో సినిమాలలో అనసూయ బిజీ 
  • ఓపక్క క్యారెక్టర్లు.. మరోపక్క స్పెషల్ సాంగులు
  • 'ఖిలాడి'లో ఆమె గేమ్ చేంజర్ అన్న దర్శకుడు  

 బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు సినిమాలలో బిజీ అయిపోయింది. తన మనసుకు నచ్చిన పాత్ర వస్తే వదలడం లేదు. తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యత వుందనిపిస్తే వెంటనే ఓకే చెబుతోంది. మరో పక్క స్పెషల్ సాంగులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇంకోపక్క అప్పుడప్పుడు కథానాయికగా కూడా సినిమాలు ఒప్పుకుంటోంది.

ఇప్పటికే 'థ్యాంక్యూ బ్రదర్' సినిమాలో నటించగా.. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ'లో ఆమె కీలక పాత్ర చేస్తోంది. ఇక తాజాగా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది.

ఈ సందర్భంగా ఈ రోజు అనసూయను తమ చిత్ర బృందంలోకి ఆహ్వానిస్తూ నిర్మాతలు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అనసూయ ఇందులో గేమ్ చేంజర్ వంటిదని ఆమె పాత్రను ఉద్దేశిస్తూ దర్శకుడు రమేశ్ వర్మ హింట్ ఇచ్చారు. ఇక ఈ 'ఖిలాడి' సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Anasuya
Raviteja
Ramesh Varma
  • Loading...

More Telugu News