Shobha Karandlaje: ఏపీ సీఎం జగన్ పాలనలో ఆలయాలపై దాడులు ఓ కొత్త ఒరవడిగా మారాయి: శోభా కరంద్లాజె

BJP MP Shobha Karandlaje responds to AP situations

  • ఏపీలో ఆలయాలపై దాడులు
  • స్పందించిన కర్ణాటక బీజేపీ నేత శోభా కరంద్లాజె
  • హిందువుల సెంటిమెంట్లను అవమానిస్తున్నారని వ్యాఖ్యలు
  • హిందువుల సహనాన్ని పరీక్షించవద్దని వెల్లడి

కర్ణాటక బీజేపీ నేత, ఎంపీ శోభా కరంద్లాజె ఏపీ పరిస్థితులపై స్పందించారు. ఏపీలో ఆలయాలపై దాడులు సీఎం జగన్ పాలనలో ఓ కొత్త ఒరవడిగా మారాయని వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలను అవమానించేలా నిందితులకు ప్రభుత్వమే కొమ్ము కాయడం మరింత కలవరపాటుకు గురిచేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రియమైన జగన్ గారు, ఇది మా బలహీనత అని భావించవద్దు. హిందువుల సహనాన్ని దయచేసి పరీక్షించవద్దు అని శోభా హితవు పలికారు. మా ఆలయాలకు రక్షణ కల్పించండి, లేకపోతే దిగిపొండి' అంటూ స్పష్టం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News