Sumanth Aswin: పెళ్లి పీటలు ఎక్కబోతున్న తెలుగు హీరో సుమంత్ అశ్విన్

Actror Sumanth Aswin to marry

  • పెళ్లికూతురు సుమంత్ వాళ్ల బంధువుల అమ్మాయి
  • ఈ నెల 13న హైదరాబాద్ శివార్లలో పెళ్లి
  • ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం

టాలీవుడ్ యంగ్ హీరోలందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లికూతురు వాళ్ల బంధువుల అమ్మాయే. పెళ్లికూతురు పేరు దీపిక. అమెరికాలోని డల్లాస్ లో ఆమె ఎమ్మెస్ చేశారు. ఈ నెల 13న హైదరాబాద్ శివార్లలో వీరి పెళ్లి జరగనుంది. కరోనా నేపథ్యంలో, వివాహం కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో జరుగుతున్నట్టు సమాచారం.  

మరోవైపు, తన కొడుకు పేరు మీదే ఎమ్మెస్ రాజు సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించారు. ఆ బ్యానర్ ద్వారానే తన స్వీయ దర్శకత్వంలో 'తూనీగ తూనీగ' చిత్రం ద్వారా సుమంత్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ తర్వాత సుమంత్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

Sumanth Aswin
Tollywood
Marriage
  • Loading...

More Telugu News