CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE Exams dates announced

  • మే 4 నుంచి జూన్ 11 వరకు పరీక్షలు
  • ఉదయం 10.30 నుంచి 1.30 వరకు 10వ తరగతి పరీక్షలు
  • రెండు షిఫ్టుల్లో 12వ తరగతి పరీక్షలు
  • వెల్లడించిన కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్

కేంద్ర విద్యాశాఖ తాజాగా సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మే 4 నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. 10వ తరగతి పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారని వివరించారు.

12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్టుల్లో కొనసాగుతాయని పోఖ్రియాల్ తెలిపారు. మొదటి షిఫ్టు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్టు వివరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News