Mamata Banerjee: సామూహిక వివాహ వేడుకల్లో సీఎం మమత స్టెప్పులు... వీడియో ఇదిగో!

Mamata Banarjee dances in a mass wedding cerempny
  • అలీపూర్ దౌర్ జిల్లాలో సామూహిక వివాహ వేడుకలు
  • హాజరైన మమతా బెనర్జీ
  • గిరిజన కళాకారులతో చేతిలో చేయి వేసి స్టెప్పులు
  • నెట్టింట సందడి చేస్తున్న వీడియో
నిరాడంబరతకు మారుపేరుగా నిలిచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల మధ్యన ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా, అలీపూర్ దౌర్ జిల్లా ఫలకటాలో జరిగిన ఓ సామూహిక వివాహ వేడుకలో ఆమె ప్రజలతో కలిసి ఆడిపాడారు.

గిరిజన కళాకారులతో కలిసి స్టెప్పులేస్తూ అందరినీ అలరించారు. నృత్య కళాకారుల చేతిలో చేయి వేసి ఆమె కూడా వారిలో కలిసిపోయి పాదం కదిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నాయి.

మమత ఇలా పబ్లిక్ లో ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కోల్ కతాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో గిరిజన సంగీత కళాకారిని బసంతి హెంబ్రామ్ తో కలిసి ఆడిపాడారు.
Mamata Banerjee
Dance
Mass Marriage Ceremony
West Bengal

More Telugu News