Peddireddi Ramachandra Reddy: ఆ విషయం కూడా నిమ్మగడ్డ రమేశ్ చెపితే బాగుంటుంది: మంత్రి పెద్దిరెడ్డి

Nimmagadd is cooperating to TDP says Peddireddy

  • చంద్రబాబు వద్ద పని చేశాననే విషయం నిమ్మగడ్డ చెపితే బాగుంటుంది
  • నిమ్మగడ్డ టీడీపీకి సహకరిస్తున్నారు
  • అచ్చెన్నాయుడు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఉన్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పలు విషయాలపై మాట్లాడుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్... గతంలో చంద్రబాబు వద్ద కూడా తాను పని చేశానని చెపితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. జిల్లాల్లో పర్యటిస్తున్న నిమ్మగడ్డ చిత్తూరు జిల్లాలో ఆ విషయం గురించి చెపితే బాగుంటుందని అన్నారు. వైసీపీ నేతలు ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు చేయడం లేదని చెప్పారు. ఏకగ్రీవాలను అడ్డుకోవాలని నిమ్మగడ్డ, చంద్రబాబు మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.

నిమ్మగడ్డ టీడీపీకి సహకరిస్తున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని... అయినా నిమ్మగడ్డ ఏమీ చేయడం లేదని విమర్శించారు. దళితులపై టీడీపీ వాళ్ల దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. తన నియోజక వర్గంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్లు ఓ వైపు దౌర్జన్యం చేస్తూనే, మరోవైపు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘం యాప్ ను ఓ ప్రైవేట్ వ్యక్తి తయారు చేస్తున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు.

Peddireddi Ramachandra Reddy
YSRCP
Chandrababu
Atchannaidu
Telugudesam
Nimmagadda Ramesh
  • Loading...

More Telugu News