Somu Veerraju: కేంద్ర నిధుల విషయంలో విజయసాయిరెడ్డి ఆరోపణలను ఖండించిన సోము వీర్రాజు

Vijayasai Reddy is lying says Somu Veerraju

  • ఎలక్షన్ కమిషన్ ను వైసీపీ పోటీ పార్టీగా భావిస్తోంది
  • కేంద్ర నిధులు ఇవ్వడం లేదని విజయసాయి చెప్పడం సరికాదు
  • గృహ నిర్మాణాలకు కేంద్రం రూ. 28 వేల కోట్లను ఇచ్చింది

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు, అధికార వైసీపీ నేతలకు మధ్య ఒక విధమైన ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీపై సోము వీర్రాజు మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ను వైసీపీ నేతలు పోటీ పార్టీగా భావిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను బెదిరించేందుకు తప్పుడు కేసులను బనాయిస్తున్నారని దుయ్యబట్టారు.

ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడటం సరికాదని చెప్పారు. విజయసాయి అబద్ధాలు చెపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలకు గాను రూ. 28 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకుని, భవనాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం విడ్డూరమని చెప్పారు. వైసీపీ అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు.

Somu Veerraju
BJP
Vijayasai Reddy
YSRCP
  • Loading...

More Telugu News