YSRCP: అచ్చెన్నాయుడి అరెస్ట్.. రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ఠ: నారా లోకేశ్

Nara Lokesh Slams YS Jagan Over Atchannaidu Arrest

  • వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో అచ్చెన్న అరెస్ట్
  • ఓటమి తప్పదనే పిరికిపింద చర్యలన్న లోకేశ్
  • దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు ఎందుకు పెట్టలేదని నిలదీత
  • నియంత పాలనకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన ఆరోపణలపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ ఇలాంటి పిరికిపంద చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ఠ అని ఆరోపించారు.

నిమ్మాడలో అచ్చెన్నాయుడి ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్లిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన అనుచరులపై పోలీసులు ఇప్పటి వరకు కేసెందుకు నమోదు చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లగుంటలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డిని హత్య చేశారని, ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని అన్నారు. ఎన్నికుట్రలు చేసినా  నియంత జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని లోకేశ్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News